- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దువ్వాడలో విషాదం.. అందరూ చూస్తుండగానే పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫామ్ నంబర్-1 వద్ద పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన నీలాపు వెంకటరెడ్డి అనే వ్యక్తి రైలు వస్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. అయితే ఇది గమనించిన రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించేలోపే రైలు అతడిపైకి వెళ్లడంతో మెడ తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, ఆత్మహత్యకు కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతుడు కొంతకాలం క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వహించినట్టు సమాచారం.






