- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suicide: పండుగ పూట విశాఖ లో తీవ్ర విషాదం.. నిప్పు అంటించుకొని వివాహిత ఆత్మహత్య
by Ramesh Goud |
కనుమ పండుగ వేళ విశాఖలో విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: కనుమ పండుగ వేళ విశాఖ(Vizag)లో విషాదం చోటు చేసుకుంది. ఒంటికి నిప్పు అంటించుకొని ఓ వివాహిత ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. లక్ష్మీ ప్రసన్న అనే మహిళ ఏడాది కాలంగా వివాదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటుంది. తన రెండేళ్ల కుమారుడుతో పాటు విశాఖలో నివాసం ఉంటుంది. అయితే ఇవాళ తన కుమారుడిని తల్లి వద్ద ఉంచి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సూసైడ్ చేసుకుంది. శరీరానికి నిప్పు అంటించుకొని లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు(Kancharapalem Police) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని కంచరపాలెం ఎస్ఐ వెల్లడించారు.
- Tags
- Vizag
- Telugu News
Next Story






