యువతిని వీడియో తీశాడని దాడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

by Thanuru Gopichand |

యువతిని వీడియో తీశాడనే కారణంతో ఓ యువకుడిపై ఆమె కుటుంబసభ్యులు దాడి చేసి నిర్బంధించారు.

యువతిని వీడియో తీశాడని దాడి..  మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో/ విశాఖపట్నం : యువతిని వీడియో తీశాడనే కారణంతో ఓ యువకుడిపై ఆమె కుటుంబసభ్యులు దాడి చేసి నిర్బంధించారు.దీంతో ఆ యువకుడు మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా కు చెందిన భాస్కర్ రావు(30) ఫార్మా పరిశ్రమలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. గాజువాక శ్రీనగర్ లో నివాసం ఉండగా, పక్కింటి యువతీ వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు భాస్కర్ రావును నిర్బంధించారు. అతను ఉండే గదికి తాళం వేసి విజయనగరంలోని తల్లిదండ్రులకు కబురు పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్ మృతికి కారణమైన యువతి కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story