- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
2017 ఆగస్టు 18 కర్నూలులో టెన్త్ విద్యార్థిని సుగాలి ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది..

X
దిశ, వెబ్ డెస్క్: 2017 ఆగస్టు 18 కర్నూలు(Kuranool)లో టెన్త్ విద్యార్థిని సుగాలి ప్రీతి(Sugali Preethi) ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. హాస్టల్ గదిలో ఆమె మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో విద్యార్థిని మృతిపై అనుమానాలు తలెత్తాయి. కేసును సీబీఐ(Cbi)కు అప్పగించాలనే డిమాండ్ వినిపించింది.
ఈ మేరకు అప్పటి జగన్ ప్రభుత్వం ప్రీతి కేసును సీబీఐకు అప్పగించింది. కానీ దర్యాప్తులో ఎలాంటి పురగతి లేదు. దీంతో 2024 ఎన్నికలకు ముందు ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి రావడంతో సుగాలి ప్రీతి కేసు మరోసారి హాట్ టాపిక్ మారింది. సీబీఐ దర్యాప్తును ఉద్దేశించి పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ కేసును మరోసారి సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసును సీబీఐకు అప్పగించింది.
Next Story






