- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌లా మాట తప్పను! వైఎస్ జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
తమ కుమార్తె సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ కుమార్తె సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. 2017లో తమ కుమార్తె పై జరిగిన దారుణ అత్యాచారం, హత్య కేసులో తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగలేదని వారు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసు విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. గతంలో తమ కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినందుకు జగన్‌కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆవేదన విన్న జగన్.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాల సాధన కోసం పోరాడుతామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పవన్ కల్యాణ్ మాట తప్పారు: ప్రీతి తల్లి
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రీతి తల్లి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో న్యాయం చేస్తానని మాటిచ్చిన పవన్.. ఇప్పుడు పదవిలోకి వచ్చాక డీఎన్ఏ రిపోర్టులు తారుమారయ్యాయని, తాను ఏమీ చేయలేనని చేతులెత్తేశారని మండిపడ్డారు. న్యాయం అడిగితే పవన్ తన అనుచరులు, వీర మహిళలు, మంత్రులతో తమపై మూకుమ్మడి దాడికి ఉసిగొల్పారని ఆరోపించారు. అంతేకాకుండా తన అంగవైకల్యాన్ని, కులాన్ని ఎత్తిచూపుతూ తీవ్రంగా అవమానిస్తున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. పవన్‌లా తాను మాట తప్పనని, న్యాయం కోసం పోరాడతానని జగన్ తమకు ధైర్యం చెప్పారని ఆమె స్పష్టం చేశారు.






