తృటిలో తప్పిన ముప్పు: ఆదోని ఫ్లైఓవర్‌పై లారీని చుట్టుముట్టిన మంటలు

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లా ఆదోని నూతన బైపాస్ బ్రిడ్జిపై ఒక్కసారిగా కలకలం రేగింది. నడిరోడ్డుపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ...

తృటిలో తప్పిన ముప్పు: ఆదోని ఫ్లైఓవర్‌పై లారీని చుట్టుముట్టిన మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఆదోని నూతన బైపాస్ బ్రిడ్జిపై ఒక్కసారిగా కలకలం రేగింది. నడిరోడ్డుపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వంతెనపై వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ భాగం నుంచి మొదలైన మంటలు చూస్తుండగానే వాహనం మొత్తానికి అంటుకున్నాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలార్పిన ఫైర్ సిబ్బంది

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమయానికి అధికారులు స్పందించి చర్యలు చేపట్టడంతో పెద్ద ముప్పు తప్పింది. కానీ ఈ ఘటన కారణంగా బైపాస్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయియింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story