బాగా చదివి సమాజానికి గౌరవం తీసుకురావాలి

by Thanuru Gopichand |

విద్యార్థులు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలి.

బాగా చదివి సమాజానికి గౌరవం తీసుకురావాలి
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలి. తద్వారా కుటుంబానికి అండగా నిలవాలి. సమాజానికి గౌరవం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మా సంస్కృతి సేవా సమితి గత నెలలో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. 120 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో మార్కుల ఆధారంగా 12 మందిని నిర్వాహకులు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులకు నవంబరు 9 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎంపికైన విద్యార్థులు మంత్రి సత్యకుమార్ యాదవ్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నిలబడలాంటే శ్రమతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలనే తపన ఉండి దానికి పరిశ్రమ తోడైతే విజయం సాధించడం నిశ్చయమన్నారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలని విద్యార్థులకు సూచించారు.

Next Story