- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడిగుడ్లు తిన్న విద్యార్థులకు అస్వస్థత.. ఇప్పుడెలా ఉందంటే
కృష్ణాజిల్లా ఏ కొండూరు మండలం పెద్దతండలోని ప్రీస్కూల్లో కోడిగుడ్లు తిన్న 9 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు

దిశ డైనమిక్ బ్యూరో: కృష్ణాజిల్లా ఏ కొండూరు మండలం పెద్దతండలోని ప్రీస్కూల్లో కోడిగుడ్లు తిన్న 9 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు తో చిన్నారులు డీలా పడిపోయారు.విద్యార్థులను తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు పిల్లలు మాత్రమే కోలుకోవాల్సి ఉందన్నారు.
మిగతా పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరు పిల్లలకు కూడా డయేరియాకు సంబందించిన చికిత్స జరుగుతుందని వైద్యులు తెలిపారు. అంగన్వాడీ లో ఆహారం విషయంలో ఏం జరిగిందనే విషయంపై ఇప్పటికే విచారణ చేస్తున్నామన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు.
దీనిపై తిరువూరు సీడీపీవోను వివరణ కోరగా తన పరిధిలో 265 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఈ పరిస్థితి ఎవరికీ లేదన్నారు. ఈ పెద్దతండాలో ఎందుకు జరిగిందో విచారణ చేస్తున్నామని తెలిపారు. అయితే జిల్లాలో ఇప్పటికే బర్డ్‌ఫ్లూ వదంతులు ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఉడికించిన గుడ్లు, కోడి మాసం తినవచ్చని అధికారులు చెబుతున్నారు.






