- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: శాంతించిన ఏయూ విద్యార్థులు.. ఆందోళన విరమణ
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు....

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థి మృతితో ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University) రెండు రోజులుగా రణరంగంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాలు(Student Unions), ఏయూ వైస్ ఛానల్సర్ రాజశేఖర్(Au Vc Rajashekar) గా విశాఖలో పరిస్థితి మారింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏయూ వర్సిటీ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. . ఆ సమయంలో వీసీ రాజశేఖర్ అక్కడికి వచ్చిన వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏయూ శాతవాహన హాస్టల్ విద్యార్థి మణికంఠ మృతికి వర్సిటీ డిస్పెన్సరీలో సరైన సౌకర్యాలు లేకపోవడమేనని నినాదాలు చేశారు. శుక్రవారం, శనివారం కూడా నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయని, ఇప్పటికైనా పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
చివరకు ఈ విషయంపై అటు ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యార్థి మృతిపై రాజకీయం చేయొద్దని సూచించింది. విద్యార్థులతో తాము చర్చలకు రెడీ అని తెలిపింది. మరోవైపు వీసీ రాజశేఖర్ సైతం విద్యార్థులతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళనను విరమించారు.






