Breaking: ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల

by Vemula.Srinu Prasad |

విద్యార్థులకు తీపి కబురు లభించింది..

Breaking: ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల(Students)కు తీపి కబురు లభించింది. పదో తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సుల్లో(B.Tech courses) నేరుగా ప్రవేశాలకు నోటిఫికేన్ విడుదలైంది. పదో తరగతి( Tenth class) పాసైన విద్యార్థుల నుంచి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ(Rajiv Gandhi University) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అటు IIIT క్యాంపస్‌లు(IIIT Campuses) సైతం దరఖాస్తులను ఆహ్వానించాయి. ఏలూరు జిల్లా నూజివీడుతో పాటు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ RK వ్యాలీ, ప్రకాశం జిల్లా ఒంగోలు, శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సుల్లో దరఖాస్తులను ఏప్రిల్ 2 ఉదయం 10 గంటల నుంచి స్వీకరిస్తారు. మే 20 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు సమర్పణకు గడువు ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు వెబ్‌సైట్: www.rgukt.in లేదా AP ఆన్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

రిజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు రుసుము వివరాలను ప్రకటించారు. జనరల్ అభ్యర్థులకు రూ.౩౦౦, రిజర్వేషన్ వర్గాలకు: రూ.200, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1000‌గా వెల్లడించారు. రిజర్వేషన్ విధానాలను అనుసరించి, పదవ తరగతిలో మెరిట్, అర్హత పరీక్షలో ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Next Story