Breaking News : సాంబారులో కప్ప.. స్టూడెంట్స్ ధర్నా

by Muthe.Rajitha |

సాంబారులో కప్ప(Frog) రావడంతో హాస్టల్ విద్యార్థినిలు ధర్నాకు దిగిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

Breaking News : సాంబారులో కప్ప.. స్టూడెంట్స్ ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : సాంబారులో కప్ప(Frog) రావడంతో హాస్టల్ విద్యార్థినిలు ధర్నాకు దిగిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. గుంటూరు(Gunturu) జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University)లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థినిలు రాత్రి భోజనం చేస్తుండగా.. సాంబారులో కప్ప కనిపించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు, పలు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ధర్నాకు దిగారు. మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు వచ్చాయని, దీనిపై హాస్టల్ నిర్వహకులను నిలదీయగా.. వర్శిటీ అధికారులు సముదాయించారని విద్యార్థినిలు పేర్కొన్నారు. కగా రాత్రి భోజనంలో సాంబారులో కప్ప రావడంతో మండిపడ్డ స్టూడెంట్స్.. మరోసారి ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెదకాకాని స్టేషన్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story