సెంట్రల్ యూనివర్సిటీలో 100 మందికి అస్వస్థత.. అసలేం జరిగిందంటే..?

by Vemula.Srinu Prasad |

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు...

సెంట్రల్ యూనివర్సిటీలో 100 మందికి అస్వస్థత.. అసలేం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లితే కొన్ని సార్లు అక్కడి వాతావరణ పడకపోవచ్చు. అస్వస్థతకు గురవొచ్చు. ఇది సర్వసాధారణం. ఇలాంటి ఘటన అనంతపురం జిల్లా(Ananthapur)లో జరిగింది. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ(Anantapur Central University)లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు కొత్తగా ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ప్రవేశాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చేరారు. యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకుని హాస్టళ్లలో ఉంటున్నారు. అయితే ఇక్కడి వాతావరణానికి విద్యార్థులు ఇంకా అలవాటు పడలేదు. దీంతో జలుబు, గొంతు నొప్పితో కూడిన జ్వరం వచ్చింది. వైరల్ ఫీవర్‌తో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు విద్యార్థులందరినీ ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రక్ష పరీక్షలు సైతం చేశారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత విద్యార్థులు కోలుకుంటారని వైద్యులు పేర్కొన్నారు.

Next Story