VIDEO: బలపం పట్టిస్తారని స్కూలుకు వెళితే చీపురు పట్టించారు

by Ajay Maddhiboyina |

చదువు చెప్పాలని బడికి పంపిస్తే కొంమంది టీచర్లు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. స్కూల్‌లో ఆయాలు చేయాల్సిన ఊడవటం, శుభ్రం చేయడం లాంటి పనులు విద్యార్థులతో చేయిస్తున్నారు.

VIDEO: బలపం పట్టిస్తారని స్కూలుకు వెళితే చీపురు పట్టించారు
X

దిశ, వెబ్ డెస్క్: చదువు చెప్పాలని బడికి పంపిస్తే కొంమంది టీచర్లు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. స్కూల్‌లో ఆయాలు చేయాల్సిన ఊడవటం, శుభ్రం చేయడం లాంటి పనులు విద్యార్థులతో చేయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తూ టీచర్లపై చర్యలు తీసుకున్నా పరిస్థితి మాత్రం మారడంలేదు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. నంబులపూలకుంట మండలంలోని రంగనపల్లి ప్రథమిక పాఠశాలలో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు చీపురు పట్టించారు. పాఠశాలలో స్వీపర్ లేకపోవడంతో విద్యార్థులనే స్వీపర్లుగా మార్చి ఊడవటం, నీళ్ల క్యాన్లు మోయడం లాంటి పనులు చేయించారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి వీడియో తీయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో చదివిపిస్తారని బడికి పంపిస్తే పనులు చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. video

Next Story