పరీక్ష రాయవద్దన్నాడని.. ప్రొఫెసర్​ను కత్తితో పొడిచిన విద్యార్థి..

by Thanuru Gopichand |

పరీక్ష రాయవద్దన్నాడని.. చదువు నేర్పే గురువును ఓ విద్యార్థి కత్తితో పొడిచాడు.

పరీక్ష రాయవద్దన్నాడని..  ప్రొఫెసర్​ను కత్తితో పొడిచిన విద్యార్థి..
X

ఏపీ ట్రిపుల్​ఐటీలో దారుణం

దిశ, డైనమిక్ ​బ్యూరో : పరీక్ష రాయవద్దన్నాడని.. చదువు నేర్పే గురువును ఓ విద్యార్థి కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఏపీలోని నూజివీడు ట్రిపుల్​ఐటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినయ్​పురుషోత్తం అనే విద్యార్థి ఏలూరు జిల్లా నూజి వీడు ట్రిపుల్​ఐటీలో ఫస్టియర్​ఎంటెక్​ చదువుతున్నాడు. వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవటంతో నేడు ల్యాబ్ ఎగ్జామ్ రాయ వద్దని ప్రొఫెసర్ ఎస్ ఎస్ వి గోపాల్ రాజు తెలిపాడు. ఎగ్జామ్ రాయాలంటే హెచ్​వోడీ పర్మిషన్ తీసు కోవాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన వినయ్​రెండు కత్తులతో ప్రొఫెసర్ పై దాడి చేశాడు. తోటి విద్యార్థుల అడ్డుకోవడంతో ప్రొఫెసర్​కు స్వల్ప గాయాలయ్యాయి. పక్క ప్రణాళికతోనే కత్తితో దాడి చేశారని ప్రొఫెసర్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేసే దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story