- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్ ను చెప్పుతో కొట్టిన ఘటనలో ట్విస్ట్..అవమానం తట్టుకోలేక !
టీచర్ ను ( Teacher) విద్యార్థిని చెప్పుతో కొట్టిన సంఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బాధిత టీచర్ షాకింగ్

దిశ, వెబ్ డెస్క్ : టీచర్ ను ( Teacher) విద్యార్థిని చెప్పుతో కొట్టిన సంఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బాధిత టీచర్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పరువు పోయింది అన్న నేపథ్యంలో ఆ టీచర్ రాజీనామా చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లాలోని ( Vijayanagaram ) రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ( Raghu Engineering College ) ఫోన్ తీసుకొని ఇవ్వలేదని ఓ టీచర్ ను బండ బూతులు తిట్టడమే కాకుండా... చెప్పుతో కూడా దారుణంగా కొట్టింది ఓ విద్యార్థిని ( Student). అక్కడే ఉన్న తోటి స్టూడెంట్స్ ఆపినా కూడా... టీచర్ ను దారుణంగా కొట్టింది ఆ విద్యార్థిని. దీనికి సంబంధించిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో... ఆ మహిళా ఫ్యాకల్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో వైరల్ కావడంతో... మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ మహిళ ఫ్యాకల్టీ.
ఆ కాలేజీ తోటి ఫ్యాకల్టీలు... రాజీనామా చేయకూడదని ఎంత విజ్ఞప్తి చేసినా... ఆమె వెనక్కి తగ్గలేదు. వెంటనే మేనేజ్మెంట్ కు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందించింది బాధిత ఫ్యాకల్టీ. ఇక ఈ విషయంపై రఘు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందరు ఫ్యాకల్టీలతో సమావేశం కూడా నిర్వహించిందట. అటు విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాలకు రావాలని... విద్యాసంస్థ యాజమాన్యం ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ... ఆ విద్యార్థిని తల్లిదండ్రులు... పట్టించుకోనట్లే వ్యవహరించారని సమాచారం అందుతుంది.






