- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ గీతం మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
by Naga Rani Yarlagadda |
విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీలో (Gitam Medical College) విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీలో (Gitam Medical College) విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ లోని ఆరవ అంతస్తు పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు కళాశాలకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుడు ఉంటోన్న గదిలో సూసైడ్ నోట్ ఏమైనా ఉందా అని సోదాలు చేస్తున్నారు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని విచారించిన అనంతరం ఆత్మహత్యకు గల కారణాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. చదువు ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేక.. ప్రేమ వ్యవహారం.. వీటిలో అతని మరణానికి కారణమేంటన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Next Story






