- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి సూసైడ్
సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: సెల్ ఫోన్(Cell Phone) కొనివ్వలేదని విద్యార్థి(Student) సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా(Ananthapur District)లో జరిగింది. ఉరవకొండ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ పదోతరగతి పరీక్ష(Tenth Exams) ఇటీవల పాస్ అయ్యారు. రెండు రోజుల క్రితమే గుంతకల్లులోని కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. అయితే స్నేహితుడు ఇచ్చిన పాత సెల్ ఫోన్‌ను శ్రీనివాస్ కొన్ని రోజులుగా వాడుకుంటున్నారు. ఈక్రమంలో కొత్త సెల్ ఫోన్ కొనివ్వాలని తండ్రి నాగభూషణంను కోరారు. దీంతో కొన్ని రోజుల తర్వాత కొనిస్తానని శ్రీనివాస్‌కు తండ్రి చెప్పారు. అంతేకాదు పాత ఫోన్‌లోని సిమ్ కార్డును శ్రీనివాస్ తండ్రి నాగభూషణం తీసుకున్నారు. పాత ఫోన్ తిరిగి తన స్నేహితుడికి ఇవ్వాలని సూచించారు. దీంతో మనస్థాపం చెందిన శ్రీనివాస్ రైలు కింద పడి చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






