యువకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కేసు పెట్టేందుకు వెళ్తే..

by Naga Rani Yarlagadda |

యువకుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

యువకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కేసు పెట్టేందుకు వెళ్తే..
X

దిశ, వెబ్‌డెస్క్: యువకుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా సి.కె.పల్లిలో వెలుగుచూసింది. విద్యార్థిని వెంట యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తిరుగుతున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వెంటపడుతుండటం, తనను ప్రేమించాలని వేధిస్తుండటంతో విద్యార్థిని ధర్మవరం పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదని.. సి.కె.పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించడంతో.. తండ్రితో కలిసి సి.కె.పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ పోలీసులు కేసు నమోదు చేయకుండా దుర్భాషలాడారని బాధితురాలి తండ్రి వాపోయారు. రక్షణ కల్పించి, న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా చేస్తే తామలాంటి వారికి న్యాయం ఎలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story