నోరు అదుపులో పెట్టుకో.. దువ్వాడకు జనసేన ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

నోరు అదుపులో పెట్టుకోవాలంటూ దువ్వాడకు జనసేన ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

నోరు అదుపులో పెట్టుకో.. దువ్వాడకు జనసేన ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(YCP MLC Duvwada Srinivas)కు యలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్(Yalamanchili Janasena MLA Vijay Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతలపై చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజకీయ నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడాలని, రీల్స్ చేసుకోవడం కాదని ఎద్దేవా చేవారు. దువ్వాడకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ(Praja Rajyam Party) అని గుర్తు చేశారు. జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌(Janasena chief Pawan Kalyan)పైనే విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడాలని ప్రతిపక్ష హోదా కోసం కాదని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ హితవు పలికారు.

Next Story