అమరావతి అభివృద్ధి దిశగా గట్టి అడుగులు : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

అమరావతి (Amaravati) అభివృద్ధి దిశగా గట్టి అడుగులు పడుతున్నాయని రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు.

అమరావతి అభివృద్ధి దిశగా గట్టి అడుగులు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) అభివృద్ధి దిశగా గట్టి అడుగులు పడుతున్నాయని రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2025 (CII Partnership Summit 2025) రెండో రోజు కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజల రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా వేగంగా సాగుతోందని పేర్కొన్నారు. నగరానికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల అంతర్గత రహదారి నెట్‌వర్క్ తో పాటు ఆధునిక భూగర్భ వసతులు ఏర్పాటు చేసే ప్రణాళికలు అమలులో ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం రూపకల్పన దశలో ఉందని, దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త ఊపిరి చేరుతుందని ఆయన వివరించారు.

రూ.91వేల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో (Infra Projects) ఇప్పటివరకు రూ.51వేల కోట్ల పనులు టెండర్ దశకు చేరాయన్నారు. వివిధ రంగాల్లో ఇప్పటికే రూ.25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని చెప్పారు. ఈ సమ్మిట్ ద్వారా రూ.40వేల కోట్ల విలువైన కొత్త అవగాహన ఒప్పందాలు (MOUs) కుదిరాయని పేర్కొన్నారు. అమరావతి త్వరలో నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ కేంద్రంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులు నగరాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతాయని అన్నారు. అమరావతి కేవలం రాజధాని ప్రాజెక్ట్ కాదు, తరతరాల పాటు నిలిచే సుస్థిర వారసత్వం అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Next Story