- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు.. డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్
రాష్ట్రంలో అటవీ భూములు అన్యాక్రాంతంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అటవీ భూములు అన్యాక్రాంతంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. ఈ మేరకు అటవీ భూముల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించిన వారి వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్ (Website)లో వెల్లడించాలని అన్నారు. ఎవరి ఆక్రమణలో ఎంత భూమి ఉంది.. వారిపై నమోదైన కేసుల వివరాలు కూడా ప్రజలకు తెలియాలన్నారు. అటవీ ఆస్తులు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయని ప్రశ్నించారు. మంగళంపేట (Mangalampeta) ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమణపై విజిలెన్స్ రిపోర్టులను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా భావితరాలకు ప్రకృతి సంపదను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.






