ఎరువుల బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-24 11:04:37  IST  )

ఏపీలో యూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎరువుల బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో యూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్, డిజిపి, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా పై సీఎం ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలన్నారు.

ఎరువులను నల్ల బజారుకు తరలించే వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఎరువుల ధరలు పెంచి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా ఏ మేరకు సరఫరా జరుగుతుందో అధికారులు సీఎంకు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు తగ్గించి మార్క్ఫెడ్ ద్వారా ఎక్కువ సరఫరా చేయాలని సీఎం సూచించారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

కాగా రాష్ట్రంలో యూరియా కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఖరీఫ్‌లో అదనంగా అందుబాటులో 83 వేల టన్నుల యూరియా ఉంది. విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తున్నారు. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ భరోసా ఇచ్చింది. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఏపీ సీఎస్ నిన్ననే ఆదేశాలు జారీ చేశారు.

Next Story