- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిద్దలూరులో కుక్కలు స్వైరవిహారం.. ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి....

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District) గిద్దలూరు(Giddalur)లో వీధి కుక్కలు(Street Dogs) స్వైర విహారం చేశాయి. ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులపై దాడి చేశాయి. చిన్నారుల ముఖం, చేతులు, కాళ్లు, వీపు భాగాలపై ఎక్కడిపడితే అక్కడ కుక్కలు విచక్షణ రహితంగా కరిచాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు.
అయితే వీధి కుక్కుల స్వైర విహారంపై గిద్దలూరు ప్రజలు మండిపడ్డారు. పట్టణంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట చిన్నారులు, మహిళలు, వృద్ధులు, సైకిల్, వాహనదారులతో పాటు పశువులను వెంబడి కుక్కలు విచక్షణా రహింతంగా దాడి చేస్తున్నాయని తెలిపారు. వీధుల్లో గుంపులు గుంపులుగా కుక్కలు తిరుగుతున్నాయని, ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సంఘటనలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కుక్కల బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల పట్ల అధికారులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇప్పటికైనా కుక్కలు స్వైరవిహారం చేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.






