- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఒంగోలులో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
ప్రకాశం జిల్లా ఒంగోలులో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లో వందేభారత్ రైలు(Vande Bharat Train)పై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. దీంతో నిందితుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వందేభారత్ రైలు సర్వీసు కొనసాగుతోంది. రోజు మాదిరిగానే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లింది.. తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుండగా రైలుపై దుండగులు ఒంగోలులో దాడి చేశారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకున్నారు. అధునాతన టెక్నాలజీతో ఈ రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులను తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేర్చుతుంది. అటువంటి రైలుపై కొందరు దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఏదో ఒక చోట వందేభారత్ రైలుపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. అయినా దుండగులు రెచ్చిపోతున్నారు. దీంతో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.






