ప్రజలకు ఆ అలవాటు మర్చే విధంగా చర్యలు.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాటు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించాలని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అన్నారు.

ప్రజలకు ఆ అలవాటు మర్చే విధంగా చర్యలు.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాటు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించాలని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అన్నారు. సోమవారం విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ (Swachandra Corporation) ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ సహా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్ (Solid Waste), లిక్విడ్ వేస్ట్ (Liquid Waste) తొలగించడం ఎంతో సవాల్ తో కూడినదని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోజుకు 6500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోందని, ప్రతి రోజూ ఈ వ్యర్థాలను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్‌ (Waste Management)కు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తీసుకున్న ఉత్తమ విధానాలను ఏపీలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని, చెత్తపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించి రీసైక్లింగ్ (Recycling) పై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాట్లు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Next Story