- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ హైకోర్టులో భారీగా పోస్టులు.. భర్తీకి ఉత్తర్వులు
రాష్ట్ర హైకోర్టులో పోస్టుల భర్తీకి మరోసారి సైతం అడుగులు పడ్డాయి

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హైకోర్టు(High Court)లో పోస్టుల భర్తీకి మరోసారి సైతం అడుగులు పడ్డాయి. మొత్తం 245 ఉద్యోగాలు(Jobs) భర్తీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు చేశారు. అయితే మూడు పోస్టులు మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరగనున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు, ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. పోస్టుల పేర్లు, వివరాలు, అర్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ప్రారంభ, చివరి తేదీ, ఫీజు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను ఆన్ లైన్‌లో ఉంచనున్నారు. కాగా ఇప్పటికే 1620 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 2తో ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలో మరో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరగుతున్నాయి. అర్హతలు కలిగిన నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు, మేధావులు పిలుపునిచ్చారు.






