- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం పున:ప్రారంభం: మంత్రి కీలక ప్రకటన
అమరావతి నిర్మాణం పునఃప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి నిర్మాణం పునఃప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోడీతో అమరావతి నిర్మాణాన్ని పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ(Pm Modi) రాష్ట్రానికి రానున్నారు. అమరావతి(Amaravati)లో మోడీ రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలపై మంత్రులు మరింత దృష్టి పెట్టారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. అమరావతి పున:నిర్మాణం, మోడీ పర్యటనపై మంత్రి నారాయణ(Minister Narayana) మాట్లాడుతూ రూ. లక్ష కోట్ల విలువైన పనులను మోడీ పున: ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది జనం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రతిపక్షాలనూ ఆహ్వానిస్తామన్నారు. ప్రొటోకాల్ ప్రకారం మాజీ సీఎం జగన్(Former Cm Jagan)కు కూడా ఆహ్వానం ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు.
అమరావతిలో ఎన్టీఆర్(Ntr) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(Statue of Unity)ని సందర్శించామని నారాయణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి, పోలవరం పనులు చురగ్గా జరుగుతున్నాయన్నారు. మోడీ పర్యటనతో అమరావతి పనులు మరింత ఊపందుకుంటాయని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని, కానీ తాము మాత్రం గౌరవిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.






