- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులది మాత్రమే కాదు.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉద్యోగులు రేపు ఒక్కరోజు సమ్మే చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉద్యోగులు రేపు ఒక్కరోజు సమ్మే చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. అయితే, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు ఉక్కు పోరాట కమిటీ మద్దతు పలికింది. కుట్రపూరితంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు జరుగుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే కార్మికుల సమ్మేపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులది మాత్రమే కాదని.. ఆంధ్రా ప్రజలదని అన్నారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్నారు. కార్మికులు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని ఆహ్వానించారు. ఇప్పటికైనా సమ్మే ఆలోచనను కార్మికులు విరమించి ప్రభుత్వాలకు సహకరించాలని శ్రీనివాస వర్మ పిలపునిచ్చారు.






