- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. ఫిక్స్...!
ఒకే రాష్ట్రమని.. ఒకే రాజధాని అని.. ఇది తమ ప్రభుత్వ నినాదమని ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: ఒకే రాష్ట్రమని.. ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని, అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) అని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీ కేపిటల్(Ap Capital)పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ(Development Decentralization)లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల కస్టర్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆటోమోటివ్ క్లస్టర్డ్, కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్డ్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మేనిప్యాక్చర్ క్లస్టర్డ్, నెల్లూరులో గ్లాస్, ఏసీ క్లస్టర్డ్, ప్రకాశం జిల్లాలో కంప్రెస్ బయోగ్లాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆక్వా క్లస్టర్డ్‌ను తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
మూడు రాజధానుల నినాదంతో ముందుకెళ్లి..
కాగా గత ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో పాలన కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా 11 సీట్లకు మించి గెలవలేకపోయింది. దీంతో అసెంబ్లీ ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. కానీ ఒకే రాష్ట్రం అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కూటమికి 164 సీట్లతో పట్టం కట్టారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా రాష్ట్ర రాజధాని అంశంపై చర్చించారు. ఈ మేరకు నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు.






