Delhi: ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేశ్ భేటీ.. కీలక చర్చలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-18 08:17:53  IST  )

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు...

Delhi: ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేశ్ భేటీ.. కీలక చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఢిల్లీ(Delhi)లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉపరాష్ట్రపతి జగనదీప్ ధన్ ఖడ్‌(Vice President Jagandeep Dhankhar)తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన హామీలు, ఆర్థిక పరిస్థితులను వివరించారు. రాష్ట్రానికి సహకరించాలని కోరారు. విశాఖలో 21న నిర్వహిస్తున్న యోగా డే ఏర్పాట్లను ఉపరాష్ట్రపతికి వివరించారు. ఇక లోకేశ్ వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్ రెడ్డి, బైరెడ్డి శబరి కూడా వెళ్లారు. ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు

Next Story