మేకపాటికి మంత్రి కాకాణి పరామర్శ

by Dishafeatures2 |
మేకపాటికి మంత్రి కాకాణి పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవలే అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్రమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పరామర్శించారు. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్లో కలిసి పరామర్శించారు. ప్రస్తుతం అందుతున్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డిని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Next Story

Most Viewed