- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం
అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సచివాలయంలో (AP Secreteriat) కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandra Babu Naidu) ఉన్న నిబద్ధత మరోసారి స్పష్టమైంది. మూడు రోజులపాటు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో బిజీబిజీగా సీఎం గడిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వాటిపై ఏపీ ప్రతినిధి బృందంలోని అధికారులు, మంత్రులతో సమీక్షను (Review Meeting) కూడా నిర్వహించారు. పర్యటన అనంతరం ఏపీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని (Bankers Meeting) శుక్రవారం నిర్వహించారు.
దావోస్ పర్యటన నుంచి రాగానే నేరుగా ఎస్ఎల్బీసీకి (SLBC) హాజరైన సీఎం వార్షిక రుణ ప్రణాళిక అమలుతో పాటు వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రుణాల వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు రూ.2.96 లక్షల కోట్ల రుణం మంజూరు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు ఇచ్చారన్నారు. కౌలు రైతులకు రూ.1,490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందజేయడం జరిగిందన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ.95,714 కోట్ల మేర రునాలను బ్యాంకర్లు జారీ చేశారని పేర్కొన్నారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్ గా చేయాలని, రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అనే అంశాలపై బ్యాంకర్లతో సమాలోచనలను జరిపారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.






