- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠ్యపుస్తకాల్లో ‘తిరుపతి గంగమ్మ జాతర’
ఏపీ(Andhra Pradesh)లోని రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి గంగమ్మ జాతర గురించి తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి గంగమ్మ జాతర గురించి తెలిసిందే. ఎనిమిది రోజుల పాటు రకరకాల వేషాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారు. చివరి రోజు అమ్మవారి విశ్వరూప దర్శనం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. విశ్వరూపం దర్శనం చేసుకుని అమ్మవారి సేవలో తరిస్తారు. తిరుమల(Tirumala) శ్రీవారికి సాక్షాత్తు... చెల్లెలుగా భావించే గంగమ్మ జాతర కోసం ఏటా తిరుమల నుంచి ఆడపడుచు లాంఛనాలతో సారె రావడం విశేషం. ఇక, తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ 2023లో ప్రభుత్వం(Government) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
గంగమ్మ తల్లి జాతరకు దాదాపు తొమ్మిది శతాబ్దాల గొప్ప చరిత్ర ఉంది. ఈ క్రమంలో ప్రసిద్ధ జాతరగా పేరొందిన ‘తిరుపతి గంగమ్మ’ జాతరకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు సర్కార్ పాఠ్యపుస్తకాల్లో జాతరను పాఠ్యాంశంగా తీసుకురానుంది. పదో తరగతి తెలుగు రీడర్ లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగ జాతరను తమిళనాడు సర్కార్(Tamilnadu) పాఠ్యాంశంగా ముద్రించింది. జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు.






