- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రభుత్వ వినూత్న ప్రయోగం.. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్లు
రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో (Danish Fibre Technology) రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో (Danish Fibre Technology) రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. అందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు (Roads) నిర్మాణ పనులను చేపట్టింది. పుట్టపర్తి నుంచి కోడూరు వరకు నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారి 342 పై ఈ ప్రయోగం చేయనుంది. నాలుగు వరుసల రహదారిపై అధికార యంత్రాంగం ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీ ద్వారా రోడ్డు వేస్తోంది. అందుకోసం డెన్మార్క్ (Denmark) దేశం నుంచి ప్రత్యేకంగా రెండు రకాల ఫైబర్ తెప్పించారు. రోడ్ల నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నూతన టెక్నాలజీతో రోడ్ల నాణ్యత, ప్రయాణ సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో రహదారి వేస్తే ప్రస్తు రోడ్ల కాలం కంటే 50 శాతం ఎక్కువ కాలం మన్నిక ఉంటాయంటున్నారు. తద్వారా మరమ్మతు ఖర్చులు కూడా తగ్గుతాయని అంటున్నారు. ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ మోడల్‌ను రాష్ట్రంలోని ఇతర హైవేలపై కూడా అమలు చేయనున్నారు.






