- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Government:ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు(Land registrations) సంబంధించిన సరికొత్త విధానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల(ఏప్రిల్) 4 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలలోని ప్రధాన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘‘స్లాట్ బుకింగ్’’ విధానాన్ని అమలు చేయనుంది. ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. నిర్ణిత సమయంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ(Registration Department) వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా.. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్ బుకింగ్స్ చేసుకోవాలి. తొలి విడతగా జిల్లా కేంద్రాల్లో అమలు చేయనున్నారు. మిగిలిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ నెల(ఏప్రిల్) చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ హరినారాయన్ దీని ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ తగ్గుతందని అన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ పనులు త్వరగా పూర్తవుతాయి అని తెలిపారు.






