- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
రాష్ట్రం(Andhra Pradesh)లోని అంగన్వాడీలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లోని అంగన్వాడీలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో గ్రాట్యూటీ పై నెల రోజులుగా కసరత్తు చేస్తూ.. కేంద్రానికి లేఖ రాస్తూనే.. సొంతంగా అమలుకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో రాష్ట్రంలోని లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం కలగనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Election) కోడ్ కొనసాగుతోంది. కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా GO ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే.. గ్రాట్యుటీ(Gratuity) అమలుతో రాష్ట్ర ప్రభుత్వం పై ప్రతి సంవత్సరం అదనంగా రూ.10కోట్లు భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు(Anganwadi Centers) ఉన్నాయి. వాటిల్లో దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు.
గ్రాట్యూటీ అమలు చేస్తే..
ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ(Gratuity) కింద ఇస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తల(Anganwadi workers)కు రూ.11,500 వేతనం ఉంది. ఇందులో 15 రోజుల వేతనం అంటే రూ.5,750 వస్తుంది. వారిని విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు 35 ఏళ్లు, 62 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో ఉండి పదవీ విరమణ చేస్తే 27 ఏళ్లు సర్వీసులో ఉన్నట్లు అవుతుంది. ఈ ప్రకారం చూస్తే.. ఆమెకు రూ.1.55 లక్షలు గ్రాట్యుటీ గా వస్తుంది. 25 ఏళ్లు, 30 ఏళ్లకే అంగన్ వాడీ కార్యకర్తగా చేరిన వారికి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ కింద మరింత ఎక్కువగా అందుతుంది. ఆయాలకు నెలకు రూ.7 వేలు కాగా.. వారికి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ రానుంది.






