కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

by Jakkula.Mamatha |

ఉగాది రోజు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఉగాది రోజు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధి(State Development) లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్(Payyavula Keshav) ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నా బార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) కోసం కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలని సీఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పని చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నాం అన్నారు.

Next Story