- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్ల వల్లే అలా జరిగింది... అది ఓ చరిత్ర: మంత్రి సత్యకుమార్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితోనే రాష్ట్ర అభివృద్ధి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పాలనలో గతి తప్పిన రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న కృషి వల్ల ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖ సీఐఐ సదస్సు అయిందని ఆయన తెలిపారు. అంచనాలకు మించి 12 రంగాల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇది పీఎం, సీఎంల దార్శనికత, ఐక్యత, సమర్ధతకు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒప్పందాలు జరిగిన వెంటనే పారిశ్రామిక సంస్థలకు అనుకూల ఉత్తర్వులు ఇవ్వడం సైతం ఓ చరిత్ర అన్నారు. ఇలాంటి ఉత్తమ విధానాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఏడాది వ్యవధిలోనే పీఎం మోదీ రాష్ట్రంలో 3సార్లు పర్యటించి రూ.2.80 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. పీఎం మోదీ విశాఖ పర్యటన రూ.2.10 లక్షల కోట్లు, అమరావతి పర్యటనలో రూ.58వేల కోట్లు, కర్నూలు పర్యటనలో రూ.13.50వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. తన వరుస పర్యటనల ద్వారా రాష్ట్రంపై తనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ గురించి పీఎం మోదీ చాటిచెబుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి కృషితో వ్యవహరిస్తున్నందున ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల దేశంలోనే తొలిసారిగా విశాఖ సాగరతీరంలో కృత్రిమ మేధ హబ్ నిర్మించబోతుందని, అదే సాగరతీరంలో పారిశ్రామిక సంస్థలు తాజాగా ప్రకటించిన పెట్టుబడులతో విశాఖ మహానగర ఖ్యాతి మరింత విస్తరించబోతుందన్నారు. 2040 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు జరిగే కృషిలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా వ్యవహరించబోతుందన్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమల్లోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిటు అయ్యాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.






