Breaking: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-07 05:59:58  IST  )

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు..

Breaking: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) విశాఖ చేరుకున్నారు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ‘అడవి తల్లి బాట’(Adavi Thalli Bata) కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆయన రెండు రోజుల పాటు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నుంచి విశాఖకు చేరుకున్నారు. దీంతో ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన అల్లూరు జిల్లాకు బయల్దేరి వెళ్లారు. డుంబ్రిగుడ మండలం పెద్దపాడులో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం గిరిజనులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారు. అక్కడే పలు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. అరకు మండలంలో మంగళవారం పర్యటించనున్నారు. ఆ తర్వాత విశాఖలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎకో టూరిజం ప్రోత్సహంపై అధికారులతో చర్చించనున్నారు.

Next Story