- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్రేగా పథకాన్ని మోదీ భ్రష్టు పట్టించారు: వైఎస్ షర్మిల
మన్రేగా పథకాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మన్రేగా(Manrega) పథకాన్ని ప్రధాని మోడీ(Prime Minister Modi) భ్రష్టు పట్టించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress Party President YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదురుపాలెం(Vedurupalem)లో ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరమని చెప్పారు. చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేశారని తెలిపారు. కొత్త నిబంధనలు పెట్టి ఉపాధి పనికి ఇబ్బందులు తెచ్చారన్నారు. ఇప్పుడు ఏకంగా మన్రేగా చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు. VB G- RAM G అని పనికి రాని చట్టం తెచ్చారని పేర్కొన్నారు. మోడీ తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారంగా మారిందని షర్మిల విమర్శించారు.
‘‘రాష్ట్రం మీద 40 శాతం భారం మోపడం అన్యాయం. ఇప్పటికే రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది. జగన్, చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల పాలు. కొత్త చట్టంతో రాష్ట్రం మీద 5 వేల కోట్ల భారం. 125 రోజులు పని కల్పన అనేది పచ్చి మోసం. సగటున 100 రోజుల పని పథకంలో 52 రోజులు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో జాబ్ కార్డులు భారీగా తొలగించారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. ఉపాధి పనిపై బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కార్డులు తొలగిస్తారు?. పేదవాడికి పని ఇచ్చే పథకం ఎందుకు రద్దు చేశారు?. ఉపాధి పథకానికి పెట్టే 80 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త చట్టం కాంట్రాక్టర్లకు మేలు చేసే చట్టం. ఉపాధి కార్మికులను కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై చేసేలా కొత్త పథకం రూపొందించారు.’’ అని వైఎస్ షర్మిల విమర్శించారు.
‘‘కొత్త చట్టం పేదల పొట్టగొట్టే చట్టం. మోదీ చట్టం గ్రామ స్వరాజ్యం వినాశనం. గ్రామాలకు హక్కులు తొలగించడం అన్యాయం. మన గ్రామానికి ఏం పని కావాలో మోదీకి ఎలా తెలుస్తుంది?. మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలి. మన్రేగా చట్టం తోనే ఉపాధికి ఊపిరి. కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ’’ అని వైఎస్ షర్మిల కోరారు.






