రేపు ఢిల్లీకి సీఎం.. A.I. ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు హాజరు

by Vemula.Srinu Prasad |

State Chief Minister Chandrababu Naidu will be going to Delhi

రేపు ఢిల్లీకి సీఎం.. A.I. ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు హాజరు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu) ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. A.I. ఇంపాక్ట్‌ సమ్మిట్‌(A.I. Impact Summit)లో పాల్గొననున్నారు. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ సమ్మిట్ ఆరు రోజుల పాటు జరగనుంది. ప్రధాని మోడీ(Pm Modi), ఫ్రాన్స్ అధ్యక్షుడు మెకరాన్, సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు సైతం పాల్గొన్నారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ థీమ్‌తో ఈ స్మిట్ జరుగుతోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే మెక్రోసాఫ్ట్ రూ. 4.5 లక్షల కోట్లు, క్వాల్ కామ్ రూ.1, 360 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇక రాష్ట్రంలో నుంచి కూడా ఈ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టాలని పలువురిని కోరనున్నారు.

Next Story