- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెట్టిచాకిరి ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం
by Bhoopathi Nagaiah |
రేపల్లె మండలం బొబ్బర్లంకకు చెందిన ఎస్టీ సామాజిక వర్గ దంపతుల వెట్టి చాకిరీ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక పంపాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ఆదేశించారు.

X
దిశ ప్రతినిధి, బాపట్ల: రేపల్లె మండలం బొబ్బర్లంకకు చెందిన ఎస్టీ సామాజిక వర్గ దంపతుల వెట్టి చాకిరీ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక పంపాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ఆదేశించారు. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ నంబూరు పద్మ, అగ్ని దంపతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన బాపట్ల కలెక్టర్ ను చైర్మన్ అభినందించారు. వెట్టిచాకిరి చేయించడంతో పాటు, దంపతులను అమ్మకానికి పెట్టడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలంలో కూడా వెట్టిచాకిరి చేయించేందుకు యత్నించడం దారుణమన్నారు. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను బాపట్ల జిల్లా అధికారులు వెంటనే కమిషన్ కు సమర్పించాలని ఆదేశించారు.
Next Story






