తిరుమ‌ల‌లో మేనేజ్మెంట్ పై శ్రీ‌వారి భ‌క్తుల ఆగ్ర‌హం

by Ajay Maddhiboyina |

తిరుమ‌ల‌లో భ‌క్తుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వ‌ద్ద క్యూలైన్ లో శ్రీవారి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు బారులు తీరారు. ఈ క్ర‌మంలో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఒక‌రినొక‌రు తోసుకున్నారు.

తిరుమ‌ల‌లో మేనేజ్మెంట్ పై శ్రీ‌వారి భ‌క్తుల ఆగ్ర‌హం
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమ‌ల‌లో భ‌క్తుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వ‌ద్ద క్యూలైన్ లో శ్రీవారి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు బారులు తీరారు. ఈ క్ర‌మంలో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఒక‌రినొక‌రు తోసుకున్నారు. పోటీప‌డుతున్న భ‌క్తుల‌ను నియంత్రించ‌లేక భ‌ద్రతా సిబ్బంది ఇబ్బందిప‌డ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపుచేసే ప్ర‌య‌త్నం చేశారు. ఒక‌రిద్ద‌రు భ‌క్తులు తోపులాట‌లో కింద‌ప‌డిపోయారు. టికెట్ల వ‌ద్ద తోపులాట జ‌ర‌గ‌కుండా క‌నీస ఏర్పాట్లు చేయ‌లేదు అంటూ భ‌క్తులు పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భ‌క్తుల తాకిడి పెరిగితే టికెట్ కౌంట‌ర్ల సంఖ్య‌ను పెంచ‌లేరా అని ప్ర‌శ్నించారు. వీఐపీల‌కే కాకుండా సామ‌న్య భ‌క్తుల‌కు సైతం అవ‌కాశం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల్లో భ‌క్తుల తొక్కిస‌లాట కార‌ణంగా ప్ర‌మాదంలో చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవ్వకుండా ఉండేలా ప్ర‌భుత్వం జాగ్ర‌త్తలు తీసుకుంటుంది.

Next Story