TTD News : శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ

by Muthe.Rajitha |

టీటీడీ(TTD) నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Nayudu) అధ్యక్షతన నేడు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TTD News : శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ(TTD) నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Nayudu) అధ్యక్షతన నేడు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ లోణి శ్రీవాణి ట్రస్ట్(Srivani Trust) రద్దు చేయాలని నిర్ణయించారు. ఇకపై సామాన్యులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్టు పేర్కొన్నారు. తిరుమలలో ఉన్న ఫ్లైఓవర్ కు గరుడ వారధి(Garuda Varadhi)గా నామకరణం చేయనున్నట్టు నిర్ణయించారు. తిరుమలలోని డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో పూర్తిగా తొలగిస్తామని అన్నారు. శారదా పీఠానికి ఇచ్చిన భూముల లీజును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తిరుమలలో కొత్తగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తిరుపతి ప్రజలకు ప్రతినెలా మొదటి మంగళవారం స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు.

Next Story