- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD:శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు తగ్గిన ఆదరణ
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు(Devotees) తిరుమల(Tirumala)కు చేరుకుని సర్వ దర్శనం, వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ద్వారా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే.. శ్రీవారి దర్శనంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల క్రేజ్ ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లలో పోటీ పడేవారు.. కానీ గత వారం రోజుల నుంచి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కొనుగోలులో విచిత్ర పరిస్థితి నెలకొంది.
శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ఆదరణ తగ్గిందని టీటీడీ(TTD) అధికారులు చెబుతున్నారు. గడిచిన వారం రోజులుగా భారీగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు మిగిలిపోతున్నాయని టీటీడీ తాజాగా పేర్కొంది. ఈ క్రమంలో గడిచిన ఆరు రోజుల్లో 4113 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మిగిలిపోయాయని తెలిపారు. ఈ తరుణంలో రోజుకు 1,500 శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ టికెట్ల కోసం భక్తులు రూ.10,000 శ్రీవాణి ట్రస్ట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. మరో రూ.500 చెల్లిస్తే దర్శనం టికెట్ జారీ చేస్తారు.






