- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srisailam : మయూర వాహనంపై విహరించిన శ్రీశైలేశుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం(Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల(Mahashivratri Brahmotsavams)లో భాగంగా నాల్గవ రోజు శనివారం స్వామి వారికి మయూర వాహన సేవ నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం(Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల(Mahashivratri Brahmotsavams)లో భాగంగా నాల్గవ రోజు శనివారం స్వామి వారికి మయూర వాహన సేవ నిర్వహించారు. భక్తులు మయూర వాహనరూఢుడై విహారించిన మల్లిఖార్జునుడిని దర్శించుకుని పులకించారు. ఉదయం కాణిపాకం.. సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
మయూర వాహనదీశులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు దంపతులు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిపించారు. స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవంలో నందీశ్వరుడు మేళతాళాలతో కదలిరాగ , వివిధ రకాల కళారూపాల విన్యాసాలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
23వ తేదీన రావణవాహన సేవ, 24వ తేదీన పుష్పపల్లకీ సేవ, 25వ తేదీన గజవాహనసేవ నిర్వహించనున్నారు. 26 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం 27న రథోత్సవం తెప్పోత్సవం 28న యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ మార్చి 01 అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ప్రత్యేక అభిషేకాలు, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 23న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి అమ్మవార్లకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.






