- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. మూడు గేట్లు ఎత్తివేత
by Yella Dhawani Reddy |
కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) జురాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,61,382 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1,46,474 క్యూసెక్కులు ఉంది. అలాగే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులకు చేరుకుంది. కాగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకులు శ్రీశైలానికి క్యూకడుతున్నారు.
Next Story






