Srisailam Reservoir:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

by Jakkula.Mamatha |

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.

Srisailam Reservoir:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) వరద(Flood) నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయంలో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 834.60 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 54.55 టీఎంసీలుగా నమోదైంది.

ఈ క్రమంలో ఇవాళ(గురువారం) ఇన్ ఫ్లో 19,054 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో నిల్. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 835.00 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.0470 టీఎంసీలుగా నమోదైంది. ఈ తరుణంలో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.

Next Story