తెరుచుకోనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు.. 25 ఏళ్లలో రికార్డు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-08 03:18:39  IST  )

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

తెరుచుకోనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు.. 25 ఏళ్లలో రికార్డు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల, జూరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులకు చేరింది. సీఎం చంద్రబాబు మంగళవారం శ్రీశైలం పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 11 గంటలకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు ఇవాళ(మంగళవారం) శ్రీశైలం క్రస్ట్‌గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయనుననారు. జూలై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. ఇక, గేట్లు ఎత్తిన అనంతరం ఏపీ సీఎం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమరావతికి వెళుతారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.4 టీఎంసీల నీరుంది. అటు సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. 164.1 టీఎంసీల ఉన్నాయి. సాగర్‌కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Next Story