తిరుపతిలో స్వామి వారికి అన్యాయం జరుగుతోంది: శ్రీనివాసనంద సరస్వతి

by Ajay Maddhiboyina |

జీవో 45ని రద్దు చేయాలని శ్రీనివాస‌నంద స‌ర‌స్వ‌తి అన్నారు. మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ జీవోను తీసుకురావ‌డం చాలా బాధ‌క‌రం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తిరుపతిలో స్వామి వారికి అన్యాయం జరుగుతోంది: శ్రీనివాసనంద సరస్వతి
X

దిశ‌, వెబ్ డెస్క్: జీవో 45ని రద్దు చేయాలని శ్రీనివాస‌నంద స‌ర‌స్వ‌తి అన్నారు. మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ జీవోను తీసుకురావ‌డం చాలా బాధ‌క‌రం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీవో 45 కార‌ణంగా హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో స్వామి వారికి అన్యాయం జరుగుతోందన్నారు. ఈ జీవోలో ఇప్పుడు ఉండే ప్ర‌భుత్వ ధ‌ర‌ల ప్ర‌కారం ల్యాండ్ రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌లు రూ.446 కోట్ల రూపాయలు ఉంద‌న్నారు. అలాంటి 20 ఎక‌రాల‌ భూమిని ప్రైవేటు హోట‌ల్ కు కేటాయించ‌డం దారుణం అని వ్యాఖ్యానించారు.

గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం ముంతాజ్ హోటల్ కు కేటాయింపులు ర‌ద్దు చేసింద‌ని చెప్పార‌ని అది చాలా సంతోష‌క‌రం అన్నారు. ఏడుకొండ‌ల్లోని శేశాద్రి కొండ ప‌ర్వ‌తం అంచున ఉండే స్థ‌లంలో హెట‌ల్ నిర్మాణాన్ని ర‌ద్దు చేశార‌న్నారు. అయితే గ‌తంలో కూట‌మి ప్ర‌భుత్వం క్యాన్సిల్ చేసిన స్థ‌లానికి ఇప్పుడు అనుమ‌తి ఇచ్చిన స్థ‌లానికి మ‌ధ్యలో ఒక రోడ్డు మాత్ర‌మే ఉంద‌ని అన్నారు. ముంతాజ్ హోట‌ల్ పేరు మాత్ర‌మే మార్చి 20 ఎక‌రాల భూమిని కేటాయించి ప్ర‌భుత్వం హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీస్తోంద‌ని మండిప‌డ్డారు.

Next Story